Posts

Showing posts from March, 2018

మంగళం జయ మంగళం.. మా నల్లనయ్యకు మంగళం

Image
మంగళం జయ మంగళం .. మా నల్లనయ్యకు మంగళం .. ||2|| మంగళం జయ మంగళం .. మా కృష్ణ స్వామికి మంగళం .. ||2|| || మంగళం || శిరమునందున మెరయుచుండెడి నెమలి పింఛకు మంగళం .. ||2|| శ్యామలాంగుని కరములందలి మధురమురళికి మంగళం ..||2|| || మంగళం || వనజగమ్మును ధిక్కరించెడి వదనశోభకు మంగళం ...||2|| కరుణరసమును చిందుచుండెడి కన్నుదోయికి మంగళం ..||2|| || మంగళం || బ్రహ్మచే పూజింపబడిన చరణయుగళికి మంగళం ..||2|| జగములన్నియు కన్నతండ్రగు చక్కనయ్యకు మంగళం .. ||2|| || మంగళం || గోపికా గణసేవితుడు శ్రీ గోవిందునకు మంగళం .. ||2|| రాధికా పరివేష్టితుండౌ రసేశ్వరునకు మంగళం ... ||2|| || మంగళం ||