Posts

Showing posts from January, 2018

ఎన్నడు విజ్ఞానమికనాకు

Image
ఎన్నడు విజ్ఞానమికనాకు విన్నపమిదె శ్రీ వేంకటనాథా బాసిన బాయవు భవబంధములు ఆస ఈ దేహమున్నన్నాళ్ళు కోసిన తొలగవు కోరికలు గాసిలి చిత్తము కలిగినన్నాళ్ళు కొచ్చిన కొరయవు కోపములు గచ్చుల గుణములు గలిగినన్నాళ్ళు తచ్చిన తగలవు తహతహలు రచ్చలు విషయపు రతులన్నాళ్ళు ఒకటికొకటికిని ఒడబడవు అకట శ్రీవేంకటాధిపుడా సకలము నీవే సరణంటే ఇక వికటము లణగెను వేడుక నాళ్ళు