Posts

Showing posts from December, 2017

గొబ్బీయళ్ళో సఖియా వినవె

గొబ్బీయళ్ళో సఖియా వినవె చిన్ని కృష్ణుని సోదరి వినవె కృష్ణుని చరితము గానారే శ్రీ కృష్ణుని చరితము గానారే చరణం : అష్టమినాడు గోకులమందు చిన్నికృష్ణుని జననమందు అందరి కోర్కెలు తీర్చేనే …... గొబ్బియళ్ళో …. కురుపాండవ సమరమందు దుఃఖితుడైన పార్థుని చూచి హితమూ చెప్పి వీరుని చేసీ చూపేనే …... గొబ్బియళ్ళో ….. దరిద్రుడైనా కుచేలునకు దరిశెనమొసగే ఈ మాధవుడు ఆతని కోర్కెలు తీర్చేనే గొబ్బియళ్ళో సఖియా వినవే చిన్ని కృష్ణుని సోదరి వినవే కృష్ణుని చరితము గానరే

స్వాగతం కృష్ణా

Image