గంధము పూసే వేలే కమ్మని మేనా




గంధము పూసే వేలే కమ్మని మేనా
యీ గంధము నీ మేనితావి కంటె నెక్కుడా
అద్దము చూచే వేలే అప్పటప్పటికినీ
అద్దము నీ మోముకంటే నపురూపమా
ఒద్దిక తామర విరి నొత్తేవు కన్నులా
గద్దరి కన్నుల కంటె కమలము ఘనమా!!
బంగారు వెట్టేవేలే పడతి నీమెయినిండా
బంగరు నీ తనుకాంతి ప్రతివచ్చేనా
ఉంగరాలేటికి నీ వొడికపు వేళా
వెంగలి మణులూ నీ వేలి గోరబోలునా!!
సవర మేటికి నీ జడియు నీనెరులకు
సవరము నీకొప్పుకు సరి వచ్చేనా
యివలజవులు నీకు నేలే వేంకటపతి

సవరని కెమ్మోవి చవి కంటేనా

Comments

Popular posts from this blog

వస్తా వట్టిదే పోతా వట్టిదే ఆశ ఎందుకంట

వీడివో అల విజయరాఘవుడు

పరమేశ్వరాజ్ఞ ఏమో తెలియదు అది ఎవరెరుగరు ఈశ్వరాజ్ఞ