Posts

Showing posts from April, 2017

రామ నామము దొరకె రారండి

రామ నామం యొక్క గొప్పతనాన్ని వివరించే అతి గొప్ప పాటల్లో ఒకటిగా ఇది చెప్పుకోవచ్చు. రామ నామము దొరకె రారండి-స్వామి నామము దొరకె రారండి బ్రహ్మాదులకు కూడ బహుదుర్లభంబైన-భక్త కోటికి జీవనాధారంబైయున్న శ్రీ గౌరి హృదయమున నిరతంబు చింతించు-దీక్షగా శివుడాత్మ విడువకా జపియించు వాల్మీకి ముఖ్యులకు ప్రాణాధికంబైనట్టి-వనిత మోహనంబై వరలుచున్నట్టి సుగ్రీవు ఎదలోని భయము బాపినయట్టి-ఆంజనేయుని ప్రాణధనమగుచు వెలుగొందు ఆ అహల్యా సతి నుద్ధరించినయట్టి-బోయయగు శబరిని తరియింపచేసినయట్టి ఆనిషాధుని గుహుని ఆదరించినయట్టి-అల విబీషణునికి ఆశ్రయంబొసగినయట్టి ముసలి గద్దకు కూడ మోక్షమిచ్చినయట్టి-మును కోతులకు కూడ ముక్తినిచ్చినయట్టి దండకారణ్య తాపసుల గాచినయట్టి-దానవోద్ధండ గర్వము చెండియున్నట్టి సంసార వారాసి సంతరింపగ జేయు-శాంతి సౌఖ్యములిచ్చి సంరక్షణము జేయు సనకాది మునిజనుల్ సంస్మరించినయట్టి-సర్వలోకాధారమై వెలుగుచున్నట్టి తారక బ్రహ్మమై తనరారుచున్నట్టి-సర్వ రక్షణ చేయు మహిమ కలిగిన యట్టి

గరుడగమన తవ చరణకమలమిహ మనసి లసతు మమ నిత్యం౹

Image
౹౹ శ్రీ విష్ణు గీతమ్ ౹౹ గరుడగమన తవ చరణకమలమిహ మనసి లసతు మమ నిత్యం౹ మమ తాపమపాకురు దేవ , మమ తాపమపాకురు దేవ౹౹ జలజనయన విధినముచిహరణముఖవిబుధవినుతపదపఙ్క౹ మమ తాపమపాకురు దేవ , మమతాపమపాకురు దేవ౹౹ భుజగశయన భవ మదనజనక మమ జననమరణభయహారీ౹ మమ తాపమపాకురు దేవ , మమతాపమపాకురు దేవ౹౹ శఙ్ఖ చక్రధర దృష్ఠదైత్యహర సర్వలోకశరణ౹ మమ తాపమపాకురు దేవ , మమతాపమపాకురు దేవ౹౹ అగణితగుణగణ అశరణశరణద విదలితసురరిపుజాల౹ మమ తాపమపాకురు దేవ , మమతాపమపాకురు దేవ౹౹ భక్తవర్యమిహ భూరికరుణయా పాహి భారతీ తీర్థం౹ మమ తాపమపాకురు దేవ , మమతాపమపాకురు దేవ౹౹ ౹౹ ఇతి శ్రీ విష్ణు గీతమ్ ౹౹ ॥ श्रीविष्णुगीतम् ॥ गरुडगमन तव चरणकमलमिह मनसि लसतु मम नित्यम् । मम तापमपाकुरु देव , मम पापमपाकुरु देव ॥ जलजनयन विधिनमुचिहरणमुखविबुधविनुतपदपद्म । मम तापमपाकुरु देव , मम पापमपाकुरु देव ॥ भुजगशयन भव मदनजनक मम जननमरणभयहारी । मम तापमपाकुरु देव , मम पापमपाकुरु देव ॥ शङ्कचक्रधर दुष्टदैत्यहर सर्वलोकशरण । मम तापमपाकुरु देव , मम पापमपाकुरु देव ॥ अगणितगुणगण अशरणशरणद विदलितसुररिपुजाल । मम तापमपाकुरु देव , मम पापमपाकुरु देव ॥ भक्तवर्यम

తలగరో లోకులు తడవకురో మమ్ము

ప || తలగరో లోకులు తడవకురో మమ్ము | కలిగినదిది మాకాపురము || చ || నరహరి కీర్తన నానిన జిహ్వ | వొరుల నుతింపగ నోపదు జిహ్వ | మురహరు పదముల మొక్కిన శిరము | పరుల వందనకు బరగదు శిరము || చ || శ్రీపతినే పూజించిన కరములు | చోపి యాచనకు జొరవు కరములు | యేపున హరికడ కేగిన కాళ్ళు | పాపుల యిండ్లకు బారవు కాళ్ళు || చ || శ్రీ వేంకటపతి జింతించు మనసు | దావతి నితరము దలచదు మనసు | దేవుడతని యాధీనపు తనువు | తేవల నితరాధీనము గాదు ||