Posts

Showing posts from October, 2015

తొల్లి కలవే ఇవియు

తొల్లి కలవే ఇవియు తొల్లి తానుఁ గలడే కల్లయునుఁ గాదు ఇది కడు నిజము గాదు.     IIపల్లవిII కను దెరచినంతనే  కలుగు నీ జగము కనుమూసినంతనే కడు శూన్యమౌను కనురెప్ప మరఁగుననె కలిమియును లేమియును తన మనోభావనలఁ దగిలి తోఁచీని.           IIతొల్లిII తలఁచినంతనె యెంత దవ్వయిన గాన్పించు తలఁపు మరచినమతికి దట్టమౌఁ దమము పొలసి మతిమరఁగుననె పుట్టుటలుఁ బోవుటలు పలుచంచలవికారభావ మీ గుణము.      IIతొల్లిII ముందు దాఁ గలిగితే మూఁడు లోకములుఁ గల వెందు దా లేకుంటే నేమియును లేదు అంది శ్రీవేంకటేశుఁ డాత్మలోననె వీఁడె కందువల నితని సంకల్ప మీపనులు.     IIతొల్లిII 4-73