Posts

Showing posts from August, 2015

నల్లని మేని నగవు చూపుల వాడు

Image
                   ప || నల్లని మేని నగవు చూపుల వాడు | తెల్లని కన్నుల దేవుడు || చ || బిరుసైన దనుజుల పింఛమణచినట్టి | తిరుపు కైదువ తోడి దేవుడు | సరిపడ్డ జగమెల్ల చక్క ఛాయకు దెచ్చి | తెరవు చూపినట్టి దేవుడు || చ || నీటగలసినట్టి నిండిన చదువులు | తేట పరచినట్టి దేవుడు | పాటిమాలినట్టి ప్రాణుల దురితపు | తీట రాసినట్టి దేవుడు || చ || గురుతువెట్టగరాని గుణముల నెలకొన్న | తిరువేంకటాద్రిపై దేవుడు | తిరముగ ధృవునికి దివ్యపదంబిచ్చి | తెరచి రాజన్నట్టి దేవుడు ||

మంగళము గోవిందునకు

ప మంగళము గోవిందునకు జయమంగళము గరుడధ్వజునకును మంగళము సర్వాత్మునకు ధర్మస్వరూపునకూ , జయజయ చ ఆదికినినాదైనదేవున కచ్యుతున కంభోజణాభున- కాదికూర్మంబై నజగదాధారమూర్తికిని వేదరక్షకునకును సంతతవేదమార్గ విహారునకు బలి- భేదికిని సామాదిగానప్రియవిహారునకు చ హరికి బరమేశ్వరునకును శ్రీధరునకును గాలాంతకునకును పరమపురుషోత్తమునకును బహుబంధదూరునకు సురమునిస్తోత్రునకు దేవాసురగణశ్రేష్ఠునకు కరుణా- కరునకును గాత్యాయనీనుతకలితనామునకు చ పంకజాసనవరదునకు భవపంకవిచ్ఛేదునకు భవునకు శంకరున కవ్యక్తునకు నాశ్చర్యరూపునకు వేంకటాచలవల్లభునకుమ విశ్వమూర్తికి నీశ్వరునకును పంకజాకుచకుంభకుంకుమ పంకలోలునకు

మంగాంబుధి హనుమంతా

Image
                          పల్లవిః మంగాంబుధి హనుమంతా నీ శరణ మంగవించితిమి హనుమంతా చరణం; బాలార్క బింబము ఫలమని ప ట్టిన ఆలరి చేతల హనుమంతా తూలని బ్రహ్మాదులచే వరములు ఓలి చేకొనినా హనుమంతా ప పమగమ మగరిగ గరిసరి రిసనిస సరిసని సరిగ రిసా రిగామ గరీ గమాప మగరిగమప పమగమపద దపమపదని నిదపదనిస సనిదనిసరి గరినిద మదనీద నినిదమ గమదామ నిదమగరిగ "మ0గా" చరణం జలధి దాట నీ సత్వము కపులకు అలరి తెలిపితివి హనుమంతా ఇలయు నాకసము నేకముగా, నటు బలిమి పెరిగితివి భళి హనుమంతా చరణం పాతాళము లోపలి మైరావణు ఆతల జంపిన హనుమంతా చేతులు మోడ్చుక శ్రీ వేంకటపతి నీ తల గోలిచే హిత హనుమంతా ప తకితతామ్ తకితజామ్ తకితజుమ్ తకితతొమ్ తరితజుమ్ సరిగ తజుమ్ రిగమ తజుమ్ గమప కితకు గమప కుకుమ్ గమపద ఝనకు పదని సరిత ఝనుత ఛనుత నిసరి కుకుమ్ ఘనుకుత నీద తనకు తరితగామ తరితఝనుత "మ0గ"