Posts

Showing posts from November, 2014

కనక శైల విహారిణి

            రాగం: పున్నాగవరాళి తాళం: ఆది శ్యామశాస్త్రి కృతి ప: కనకశైల విహారిణీ అంబా కామకోటి బాలే సుశీలే అ.ప: వనజ భవ హరి నుతే దేవి హిమ గిరిజే లలితే సతతం | వినతం మాం పరిపాలయ శంకర వనితే సతిమహా త్రిపుర సుందరి || ౧. శామలాంబికే భవాబ్ది తరణే శ్యామకృష్ణ పరిపాలిని జననీ | కామితార్థ ఫల దాయకి కామాక్షి సకల లోక సాక్షి      

దేవి బ్రోవ సమయమిదే

                  రాగం: చింతామణి తాళం: ఆది శ్యామశాస్త్రి కృతి ప: దేవి బ్రోవ సమయమిదే అతి వేగమె వచ్చి అనుపల్లవి: నా వెతలు దీర్చి కరుణించవే శంకరి కామాక్షి 1. లోక జనని నాపై దయలేదా నీ దాసుడు గాద శ్రీ కంచి విహారిణి కళ్యాణి ఏకామ్రేశ్వరుని ప్రియ భామయైయున్న నికేమమ్మయంతో భారమా వినుమా నాతల్లి 2: రేపు మాపని చెప్పితే నే వినను ఇక తాళను ఈ ప్రొద్దు దయ సెయవే కృప జూడవే నీ పదాబ్జములే మదిలో సదా ఎంచి ప్రాపు కోరియున్ననమ్మ ముదముతో మా తల్లి 3: శ్యామ కృష్ణ సోదరి కౌమారి బింబాదరి గౌరి హేమచాలజే లలితే పరదేవతే కామాక్షి నిన్నువిన భువిలో ప్రేమతో కాపాఢేవారెవరున్నరమ్మ వినుమా మా తల్లి