Posts

Showing posts from March, 2014

మనసులోని మర్మమును

                 ప. మనసు లోని మర్మమును తెలుసుకో మాన రక్షక మరకతాంగ నా (మనసు) అ. ఇన కులాప్త నీవే కాని వేరెవరు లేరు ఆనంద హృదయ (మనసు) చ. మునుపు ప్రేమ-గల దొరవై సదా చనువునేలినది గొప్ప కాదయ్య కనికరంబుతోనీ వేళ నా కరము పట్టు త్యాగరాజ వినుత (మనసు)

సఖి యా రమితా వనమాలినా

                   అనిలతరళ కువలయ నయనేన తపతి న సా కిసలయ శయనేన సఖి! యా రమితా వనమాలినా సఖి! యా రమితా వనమాలినా వికసిత సరసిజ లలితముఖేన స్ఫుటతి న సా మనసిజవిశిఖేన సఖి! యా రమితా వనమాలినా అమ్రుత మధుర మ్రుదుతర వచనేన జ్వలతి న సా మలయజ పవసేన సఖి! యారమితా వనమాలినా స్థల జలరుహ రుచికర చరణేన లుఠతి న సా హిమకర కిరణేన సఖి! యారమితా వనమాలినా సజలజలద సముదయరుచిరేణ దళతి న సా హృది విరహ భరేణ సఖి! యా రమితా వనమాలినా కనక నికష రుచి శుచి వసనేన శ్వసితి న సా పరిజన హసనేన సఖి! యా రమితా వనమాలినా శ్రీ జయదేవ భణిత వచనేన ప్రవిశతు హరి రాపి హృదయ మనేన సఖి! యా రమితా వనమాలినా సఖి! యా రమితా వనమాలినా

ఆడమోడిగలదే రామయ్య మాట

                 ప. ఆడ మోడి గలదే రామయ్య మాట(లాడ) అ. తోడు నీడ నీవేయనుచును భక్తి కూడిన పాదము పట్టిన నాతో మాట(లాడ) చ. చదువులన్ని తెలిసి శంకరాంశుడై సదయుడాశుగ సంభవుడు మ్రొక్క    కదలు తమ్ముని పల్క జేసితివి గాకను త్యాగరాజు ఆడిన మాట(లాడ)

రామచంద్రులు నాపై చలము చేసినారు

                  ప: రామచంద్రులు నాపై చలము చేసినారు సీతమ్మ చెప్పవమ్మ నీ వైన సీతమ్మ చెప్పవమ్మ || రామచంద్రులు || అ.ప: కట కట వినడేమి సేయుదు కఠినచిత్తుని మనసు కరుగదు కర్మము లెటులుండునోకద ధర్మమే నీకుందునమ్మా || రామచంద్రులు || చ1: దిన దినము మీచుట్టు దీనతతో తిరుగ దిక్కెవ్వరిక ఓయమ్మ దీనపోషకు డనుచు వేడితి దిక్కులన్నియు ప్రకటమాయెను ఒకమాటైన అనడు ఎక్కువేమని తలతునమ్మా || రామచంద్రులు || చ2: కౌసల్య తనయుడు కపటము చేసినాడు కారణ మేముండెనో కన్నడ చేసెదవా నీ కన్నుల వై భవముతోడ విన్నవింప గదవమ్మా నీ కన్న దిక్కెవరో యమ్మ || రామచంద్రులు || చ3: దశరధాత్మజుడెంతో దయశాలి యనుకొంటి ధర్మహీనుడె ఓయమ్మ దాస జనులకు దాత అతడట వాసిగ భద్రగిరీశుడట రామదాసుని నేల రాడట రవికులాంబుధి సోముండితడట || రామచంద్రులు ||

జానకీ రమణ కళ్యాణ సజ్జన నిపుణ

      జానకీ రమణ కల్యాణ సజ్జన నిపుణ కళ్యాణ సజ్జన నిపుణ || ఓనమాలు రాయగానే నీ నామమే తోచు | నీ నామమే తోచు శ్రీరామా || ఎందు జూచిన నీదు అందమే గానవచ్చు | అందమె కానవచ్చు శ్రీరామా || ముద్దు మోమును చూచి మునులెల్ల మోహించిరి | మునులెల్ల మోహించిరి శ్రీరామా || దుష్టులు నినుజూడ దృష్టి తాకును ఏమో | దృష్టి తాకును ఏమో శ్రీరామా || ఎన్ని జన్మలెత్తిన నిన్నే భజింప నీవే | నిన్నే భజింప నీవే శ్రీరామా || ముక్తి నే నొల్ల నీదు భక్తి మాత్రమే చాలు | భక్తి మాత్రమే చాలు శ్రీరామా || రాతి నాతిగ జేసె నీ తిరువడిగళె కాదా | నీ తిరువడిగళె కాదా శ్రీరామా || నారదాది మునులు పరమపద మందిరిగద | పరమపద మందిరిగా శ్రీరామా || సత్య స్వరూపముగ ప్రత్యక్షమైనావు | ప్రత్యక్షమై నావు శ్రీరామా || భద్రాచల నివాస పాలిత రామదాస | పాలిత రామదాస శ్రీరామా ||

రామజోగిమందుకొనరే ఓ జనులారా

               రామ జోగిమందు కొనరే ఓ జనులారా || రామ || రామజోగి మందుమీరు - ప్రేమతో భుజియించరయ్యా కామ క్రోధముల నెల్ల కటగు పారదోలే మందు || రామ || 1. కాటుక కొండలవంటి - కర్మములెడబాపే మందు సాటిలేని జగమునందు - మా స్వామి మందు || రామ || 2. కోటి ధనములిత్తునని కొనబోయినా దొరకని మందు సాటిలేని భాగవతులు కొనబోయిన మందు ||రామ|   సాటిలేని భాగవతూలు స్మరణ చేసె పామరులారా!!రామ!! 3. ముదముతో భద్రాద్రియందు - ముక్తిని పొందించే మందు సదయుడైన రామదాసు - సద్భక్తితో గొలిచే మందు || రామ ||

గరుడగమన రారా నను నీ కరుణ నేలుకోరా

                      గరుడగమన రారా నను నీ కరుణ నేలుకోరా పరమ పురుష యే వెరవులేక నీ మరుగుజొచ్చితిని అరమర సేయకు || గరుడ || పిలువగానె రమ్మి అభయము తలుపగానె యిమ్మి కలిమి బలిమి నాకిలలో నీవని పలువరించితిని నను గన్నయ్య || గరుడ || పాలకడలి శయన దశరధ బాల జలజనయన పాలముంచు నను నీటముంచు నీ పాలబడితి నిక జాలముసేయక || గరుడ || ఏలరావు స్వామి నను నీవేలుకోవదేమి ఏలువాడవని చాల నమ్మితిని ఏలరావు కరుణాలవాల హరి || గరుడ || ఇంత పంతమేల భద్రగిరీశ వరకృపాల చింత లణచి శ్రీరామదాసుని అంతరంగ పతివై రక్షింపుము || గరుడ ||

తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు

          ప: తక్కువేమి మనకు రాముడు ఒక్కడుండు వరకు చ 1: ప్రక్క తోడుగా భగవంతుడు మన చక్రధారియై చెంతనె యుండగ || తక్కువేమి || చ 2: మ్రుచ్చు సోమకుని మును జంపిన యా మత్స్యమూర్తి మన పక్షము నుండగ || తక్కువేమి || చ 3: సురల కొరకు మందరగిరి మోసిన కూర్మావతారుని కృపమనకుండగ || తక్కువేమి || చ 4: దురాత్ముడౌ హిరణ్యాక్షు ద్రుంచిన వరాహమూర్తి మనవాడై యుండగ || తక్కువేమి || చ 5: హిరణ్యకశిపుని ఇరుచెక్కలుగా పరచిన నరహరి ప్రక్కన నుండగ || తక్కువేమి || చ 6: భూమి స్వర్గమును పొందుగ గొలిచిన వామనుండు మనవాడై యుండగ || తక్కువేమి || చ 7: ధరలో క్షత్రియులను దండించిన పరశురాముని దయ మనకుండగ || తక్కువేమి || చ 8: దశగ్రీవు మును దండించిన యా దశరథరాముని దయ మనకుండగ || తక్కువేమి || చ 9: ఇలలో యదుకులమున నుదయించిన బలరాముడు మన బలమై యుండగ || తక్కువేమి || చ 10: దుష్ట కంసుని ద్రుంచినట్టి శ్రీ కృష్ణుడు మనపై కృపతో నుండగ || తక్కువేమి || చ 11: కలియుగాంత్యమున కలిగిన దైవము కలికిమూర్తిమము గాచుచు నుండగ || తక్కువేమి || చ 12: నారాయణదాసుని గాచిన శ్రీమన్ నారాయణు నెర నమ్మియుండగ || తక్కువేమి || చ 13: రామదాసునీ కాచెడి శ్

హరి హరి రామ నన్నరమర జూడకు

   హరి హరి రామ నన్నరమర జూడకు నిరతము నీ నామస్మరణ మే మరను దశరధ నందన దశముఖ మర్థన పశుపతి రంజన పాప విమోచన || హరి || మణిమయ భూషణ మంజుల భాషణ రణ జయ భీషణ రఘుకుల పోషణ || హరి || పతితపావన నామ భద్రాచలధామ సతతము శ్రీరామ దాసు నేలుమా రామ || హరి ||

ప్రళయ పయోధిజలే కేశవా

          ప్రళయ పయోధిజలే కేశవా ధృతవా నసి వేదం కేశవా విహిత వహిత్ర చరిత్ర మఖేదం కేశవా ధృత మీనశరీర జయ జగదీశ హరే క్షితి రతి విపులతరే కేశవా తవ తిష్ఠతి పృష్ఠే ధరణి ధరణ కిణ చక్రగరిష్ఠే కేశవా ధృత కచ్చపరూప జయ జగదీశ హరే!! వసతి దశన శిఖరే కేశవా ధరణీ తవ లగ్నా శశిని కళంకకలేవ నిమగ్నా కేశవా ధృత సూకరరూప! జయ జగదీశ హరే తవ కరకమలే కేశవా నఖ మద్భుతశృంగం దళిత హిరణ్యకశిపు తనుభృంగం కేశవా ధృత నరహరిరూప! జయ జగదీశ హరే ఛలయసి విక్రమణే కేశవా బలి మద్భుత వామన పదనఖనీర జనిత జన పావన కేశవా ధృత వామనరూప! జయ జగదీశ హరే క్షత్రియ రుధిరమయే కేశవా జగ దపగత పాపం కేశవా స్నపనయసి పయసి శమిత భవ తాపం కేశావా ధృత భృగుపతిరూప! జయ జగదీశ హరే వితరసి దిక్షు రణే కేశవా దిక్పతి కమనీయం కేశవా దశముఖ మౌళి బలిం రమణీయం కేశవా ధృత రామశరీర! జయ జగదీశ హరే వహసి వపుశి విశదే కేశవా వసనం జలదాభం కేశవా హలహతి భీతి మిళిత యమునాభం కేశవా ధృత హలధరరూప! జయ జగదీశ హరే నిందసి యజ్ఞవిధే కేశవా రహహ శృతిజాతం కేశవా సదయ హృదయ దర్శిత పశుఘాతం కేశవా ధృత బుద్ధశరీర! జయ జగదీశ హరే మ్లేఛ్ఛనివహనిధనే కేశవా కలయసి కరవాలం కేశవా ధూమకేతు మివ కిమపి కరాలం కేశవా ధృత

హరి హరి హతాదరతయా సా గతా కుపితేవ

                హరి హరి హతాదరతయా సా గతా కుపితేవ!!హరిహరి!! మామియం చలితా విలోక్య వృతం వధూ నిచయేన సాపరాధతయా మయాపి న వారితాతిభయేన!!హరిహరి!! కిం కరిష్యతి కిం వదిష్యతి సా చిరం విరహేణ! కిం ధనేన జనేన కిం మమ జీవితేన గృహేణ!!హరిహరి!! చింతయామి తదాననం కుటిల భ్రూ కోప భరేణ శోణ పద్మమివోపరి భ్రమతాకులం భ్రమరేణ!! తామహం హృది సంగతామనిశం భృశం రమయామి కిం వనేనుసరామి తామిహ కిం వృథా విలపామి!! క్షమ్యతామపరం కదాపి తవేదృశం న కరోమి దేహి సుందరి దర్శనం మమ మన్మథేన దునోమి!! వర్ణితం జయదేవకేన హరేరిదం ప్రవణేన బిందుబిల్వ సముద్ర సంభవ రోహిణీ రమణేన!!

శ్రీరామ నామం మరువాం మరువాం

              శ్రీరామ నామం మరువాం మరువాం సిద్ధము యమునకు వెరువాం వెరువాం గోవిందునేవేళ గొలుతాం గొలుతాం దేవుని గుణములు దలుతాం దలుతాం విష్ణుకథలు చెవులు విందాం విందాం వేరేకథలు చెవుల మందం మందం రామదాసులు మాకు సారం సారం కామదాసులు మాకు దూరం దూరం!! నారాయణుని మేము నమ్మేం నమ్మేం నరులనింక మేము నమ్మాం నమ్మాం మాధవ నామము మరువాం మరువాం మరి యమబాధకు వెరువాం వెరువాం!! అవనిజపతి సేవ మానాం మానాం మరియొకజోలంటే మౌనం మౌనం శ్రీభద్రగిరీశుని కందాం కందాం భద్రముతో మనముందాంముందాం!!

ననుబ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లి

                   ననుబ్రోవమని చెప్పవే సీతమ్మతల్లి || ననుబ్రోవమని || ననుబ్రోవమని చెప్పవే నారీ శిరోమణి జనకుని కూతుర జనని జానకమ్మ || ననుబ్రోవమని || ప్రక్కను చేరి చెక్కిలి నొక్కుచు చక్కగ మరుకేళి చొక్కియుండెడివేళ || ననుబ్రోవమని || ఏకాంతరంగుడు శ్రీకాంత నినుగూడి ఏకాంతమున నేక శయ్య నున్నవేళ || ననుబ్రోవమని || అద్రిజ వినుతుడు భద్రగిరీశుడు నిద్రమేల్కొనువేళ నెలతరో బోధించి || ననుబ్రోవమని ||

ఏతీరుగ నను దయజూచెదవో ఇనవంశోత్తమ రామా

          ఏతీరుగ నను దయజూచెదవో ఇనవంశోత్తమ రామా నాతరమా భవ సాగర మీదను నళినదళేక్షణ రామా || ఏతీరుగ || శ్రీ రఘునందన సీతారమణా శ్రితజనపోషక రామా కారుణ్యాలయ భక్తవరద నిను కన్నది కానుపు రామా || ఏతీరుగ || మురిపెముతో నా స్వామివి నీవని ముందుగ తెల్పితి రామా మరవక యిక నభిమానముంచు నీ మరుగుజొచ్చితిని రామా || ఏతీరుగ || క్రూరకర్మములు నేరక జేసితి నేరము లెంచకు రామా దారిద్ర్యము పరిహారము చేయవె దైవశిఖామణి రామా || ఏతీరుగ || గురుడవు నామది దైవము నీవని గురుశాస్త్రంబులు రామా గురుదైవంబని యెరుగక తిరిగెడు క్రూరుడ నైతిని రామా || ఏతీరుగ || నిండితి వీ వఖిలాండకోటి బ్రహ్మాండములందున రామా నిండుగ మది నీ నామము దలచిన నిత్యానందము రామా ||ఏతీరుగ || వాసవ కమల భవాసురవందిత వారధి బంధన రామా భాసురవర సద్గుణములు గల్గిన భద్రాద్రీశ్వర రామా || ఏతీరుగ || వాసవనుత రామదాస పోషక వందనమయోధ్యరామా దాసార్చిత మాకభయ మొసంగవె దాశరధీ రఘురామా || ఏతీరుగ ||

పాహి రామప్రభో పాహిరామప్రభో పాహి భద్రాద్రి వైదేహి రామప్రభో

              ప: పాహి రామప్రభో పాహి రామప్రభో పాహి భద్రాద్రి వైదేహి రామప్రభో పాహి రామప్రభో ౧.  ఇందిరా హృదయారవిందాధి రూఢ సుందరాకార నానంద రామప్రభో ఎందునే చూడ మీ సుందరానందము కందునో కన్నులింపొంద శ్యామప్రభో ౨.  బృందారకాది బృందార్చిత పదార విందముల సందర్షితానంద రామప్రభో తల్లివి నీవె మా తండ్రివి నీవె మా దాతవు నీవు మా భ్రాత రామప్రభో ౩.  నీదు బాణంబులను నాదు షతృల బట్టి బాధింపకున్నావదేమి రామప్రభో ఆదిమధ్యాంత బహిరంతరాత్ముండనుచు వాదింతునే జగన్నాథ రామప్రభో ౪.  శ్రీ రామరామేతి శ్రేష్ఠ మంత్రము సారె సారె కును వింతగా చదువు రామప్రభో శ్రీ రామ నీ నామ చింతనామృత పాన సారమే నాదు మది గోరు రామప్రభో ౫. కలికి రూపము దాల్చి కలియుగంబున నీవు వెలసితివి భద్రాద్రి నిలయ రామప్రభో అవ్యయుడవైన ఈ అవతారములవలన దివ్యులైనారు మునులయ్య రామప్రభో ౬. పాహి శ్రీ రామ నీ పాద పద్మాశ్రయుల పాలింపుమా భద్రశీల రామప్రభో పాహి రామప్రభో పాహి రామప్రభో పాహి భద్రాద్రి వైదేహి రామప్రభో

ఇక్ష్వాకు కులతిలకా ఇకనైన పలుకవే రామచంద్రా

          ఇక్ష్వాకు కులతిలకా ఇకనైన పలుకవే రామచంద్రా నన్ను రక్షింప కున్నను రక్షకు లెవరింక రామచంద్రా చుట్టు ప్రాకారములు సొంపుతో కట్టిస్తి రామచంద్రా ఆ ప్రాకారముకు బట్టె పదివేల వరహాలు రామచంద్రా భరతునకు చేయిస్తి పచ్చల పతకము రామచంద్రా ఆ పతకమునకు పట్టె పదివేల వరహాలు రామచంద్రా శత్రుఘ్నునకు నేను చేయిస్తి  మొలతాడు రామచంద్రా ఆ మొల త్రాటికి పట్టె మొహరీలు పదివేలు రామచంద్రా లక్ష్మణునకు చేయిస్తి ముత్యాల పతకము రామచంద్రా ఆ పతకమునకు పట్టె పదివేల వరహాలు రామచంద్రా సీతమ్మకు చేయిస్తి చింతాకు పతకము రామచంద్రా ఆ పతకమునకు పట్టె పదివేల వరహాలు రామచంద్రా కలికి తురాయి  మెలుకుగ చేయిస్తి రామచంద్రా నీవు కులుకుచు తిరిగేవు ఎవరబ్బ సొమ్మని రామచంద్రా నీ తండ్రి దశరథ మహరాజు పెట్టెనా రామచంద్రా లేక నీ మామ ఆ జనక మహరాజు పంపెనా రామచంద్రా అబ్బ తిట్టితినని ఆయాస పడవద్దు రామచంద్రా ఈ దెబ్బల కోర్వక అబ్బ తిట్టితినయ్యా రామచంద్రా భక్తులందరిని పరిపాలించెడి శ్రీ రామచంద్రా నీవు క్షేమముగ శ్రీ రామదాసుని యేలుము రామచంద్రా

ఇదిగో భద్రాద్రి గౌతమి అదిగో చూడండి

          ఇదిగో భద్రాద్రి గౌతమి అదిగో చూడండి || ఇదిగో || ముదముతో సీత ముదిత లక్ష్మణుడు కదసి కొలువగా రఘుపతి యుండెడి|| ఇదిగో || చారు స్వర్ణ ప్రాకార గోపుర ద్వారములతో సుందరమై యుండెడి || ఇదిగో || అనుపమానమై అతిసుందరమై తనరు చక్రము ధగ ధగ మెరిసెడి || ఇదిగో || కలియుగమందున నిల వైకుంఠము నలరుచునున్నది నయముగ మ్రొక్కుడి || ఇదిగో || పొన్నల పొగడల పూపొద రిండ్లతో చెన్ను మీరగను శృంగారంబగు || ఇదిగో || శ్రీకరముగ శ్రీరామదాసుని ప్రాకటముగ బ్రోచే ప్రభువాసము || ఇదిగో ||

పలుకే బంగారమాయెనా కోదండపాణి

      పలుకే బంగారమాయెనా కోదండపాణి || పలుకే || పలుకే బంగారమాయె పిలిచిన పలుకవేమి కలలో నీ నామస్మరణ మరువ చక్కని సామి || పలుకే || ఇరువుగ ఇసుకలోన పొరలిన యుడుత భక్తికి కరుణించి బ్రోచితివని నెర నమ్మితిని తండ్రి || పలుకే || రాతి నాతిగజేసి భూతలమందున ప్ర ఖ్యాతి జెందితివని ప్రీతితో నమ్మితి తండ్రి || పలుకే || ఎంత వేడినా గానీ సుంతైన దయరాదు పంతము చేయ నేనెంతటివాడను తండ్రి || పలుకే || శరణాగత త్రాణ బిరుదాంకితుడవుగావా కరుణించు భద్రాచల వర రామదాస పోష || పలుకే ||

తారకమంత్రము కోరిన దొరికెను

                తారక మంత్రము కోరిన దొరికెను ధన్యుడ నైతిని ఓ రన్నా ||తారక మంత్రము|| మీరిన కాలుని దూతల పాలిటి మృత్యువు యని మది నమ్మన్న ||తారక మంత్రము|| మచ్చికతో నితరాంతరమ్ముల మాయలలో పడబోకన్నా హెచ్చుగ నూట యెనిమిది తిరుపతు లెలమి తిరుగ పనిలేదన్నా ||తారక మంత్రము|| ముచ్చటగా తా పుణ్యనదులలో మునుగుట పని ఏమిటికన్నా వచ్చెడి పరువపు దినములలో సుడి వడుటలు మానకయున్న ||తారక మంత్రము|| ఎన్ని జన్మముల నుండి జూచినను ఏకో నారాయణుడన్న అన్ని రూపులై యున్న ఆ పరమాత్ముని  నామము కథ విన్నా ||తారక మంత్రము|| ఎన్ని జన్మముల చేసిన పాపము యీ జన్మముతో విడునన్నా అన్నిటికిది కడసారి జన్మము సత్యంబిక పుట్టుట సున్నా ||తారక మంత్రము|| నిర్మల అంతర్లక్ష్య భావమున నిత్యానందముతో నున్న కర్మంబులు విడి మోక్ష పద్ధతిని కన్నులనే జూచుచునున్న ||తారక మంత్రము|| ధర్మము తప్పక భద్రాద్రీశుని తన మదిలో నమ్ముకయున్న మర్మము తెలిసిన రామదాసు హృ న్మందిరమున కేగుచునున్న ||తారక మంత్రము||

దిబ్బలు వెట్టుచు దేలినదిదివో

                  ప || దిబ్బలు వెట్టుచు దేలిన దిదివో | ఉబ్బు నీటిపై నొక హంస || చ || అనువున గమల విహారమె నెలవై | ఒనరియున్న దిదె ఒక హంస | మనియెడి జీవుల మానస సరసుల | వునికి నున్న దిదె ఒక హంస || చ || పాలు నీరు నేర్పరచి పాలలో | నోలలాడె నిదె యొక హంస | పాలుపడిన యీ పరమహంసముల | ఓలి నున్న దిదె యొక హంస || చ || తడవి రోమరంధ్రంబుల గ్రుడ్ల | నుడుగక పొదిగీ నొక హంస | కడు వేడుక వేంకటగిరి మీదట | నొడలు పెంచెనిదె యొక హంస ||  

భో శంభో శివ శంభో స్వయంభో

                     ప. భో శంభో శివ శంభో స్వయంభో అ.ప. గంగాధర శంకర కరుణాకర మామవ భవసాగర తారక |4| !! భో శంభో!! చ. 1. నిర్గుణ పరబ్రహ్మ స్వరూప గమగమ భూత ప్రపంచ రహిత నిజపుర నిహిత నితాంత అనంత ఆనంద అతిశయ అక్షయలింగ !! భో శంభో!! చ. 2. ధిమిత ధిమిత ధిమి ధిమికిట తకిటతోం - తోం తోం తిమికిట తరికిట కిటతోం - మతంగ మునివర వందిత ఈశా సర్వ దిగంబర వేష్టితవేష నిత్య నిరంజన నిత్యనటేశ -  ఈశ సభేశ సర్వేశ !! భో శంభో!! | మతంగ ... | మతంగ మునివర వందిత ఈశ శర్వ దిగంబర వేష్టితవేష - 2 నిత్య నిరంజన నిత్యనటేశ - 2 ఈశ సభేశ సర్వేశ !! భో శంభో!