Posts

Showing posts from January, 2014

మూసిన ముత్యాలకేలే మొరగులు

                          మూసిన ముత్యాల కేలె మొఱగులు - ఆశల చిత్తాన కేలే అలవోకలు కందులేని మోముకేలే కస్తూరి - చిందు నీకొప్పున కేలే సీమంతులు మందయానమున కేలే మట్టెల మోత -గంధమేలే పైపై కమ్మని నీమేనికి భారపు గుబ్బల కేలే పయ్యద నీ -బీరపు జూపుల కేలే పెడామోము జీరల బుజాల కేలే చెమటల నీ -గోరంట గోళ్ళ కేలే కొనవాండ్లు ముద్దుల మాటల కేలే ముదములు నీ -యద్దపు జెక్కుల కేలే అరవిరులు వొద్దిక మాటల కేలే వూర్పులు నీకు -నద్దమేలే తిరువేంకటాద్రీశు గూడి

దక్షిణామూర్తే విదళిత దాసార్తే

ప: దక్షిణా మూర్తే విదళిత దాసార్తే చిదానంద పూర్తే సదా మౌన కీర్తే అ ప: అక్షయ సువర్ణ వట వృక్ష మూల స్థితే రక్ష మాం సనక-ఆది రాజ యోగి స్తుతే రక్షిత సద్భక్తే శిక్షిత దుర్యుక్తే అక్షర-అనురక్తే అవిద్యా విరక్తే ౧. నిఖిల సంశయ హరణ నిపుణ-తర యుక్తే నిర్వికల్ప సమాధి నిద్రా ప్రసక్తే అఖండైక రస పూర్ణ-ఆరూఢ శక్తే అపరోక్ష నిత్య బోధ-ఆనంద ముక్తే సుఖ-తర ప్రవృత్తే స్వ-అజ్ఞాన నివృత్తే స్వ-గురు గుహ-ఉత్పత్తే స్వ-అనుభోగ తృప్తే

సుబ్బీ గొబ్బెమ్మా

సుబ్బీ గొబ్బెమ్మా .. సుబ్బణ్ణీయవే ..   చామంతి పువ్వంటీ చెల్లెల్నీయవే తామర పూవంటీ తమ్ముణ్ణీయవే బంతి పువ్వంటి బావ నివ్వవే తాటి పండంటి తాత నివ్వవే మల్లె పూవంటి మామా నివ్వవే   అరటి పండంటి అత్త నివ్వవే మొగలి పూవంటీ .. మొగుణ్ణీయవే

అటవీ స్థలములు కడుగుదమా

అటవీ స్థలములు కరుగుదమా చెలి వట పత్రమ్ములు కోయుదమా!!2 సార్లు!! చింత పిక్కాలాడుదమా చిరు చిరు నవ్వులు నవ్వుదమా!!అటవీ!! చెమ్మా చెక్కాలాడుదమా చక్కిలిగింతలు పెట్టుదమా!!అటవీ!! కోతీ కొమ్మచ్చులాడుదమా   కొమ్మల చాటున దాగుదమా!!అటవీ!! చల్లని గంధం తీయుదమా సఖియా మెడలో పూయుదమా!!అటవీ!! పూలదండలు గుచ్చుదమా దేవుని మెడలో వేయుదమా!!అటవీ!!

ఏల వచ్చెనమ్మ

Image
ఏల వచ్చెనమ్మ కృష్ణుడేల వచ్చెను ఆ మాయదారి కృష్ణుడొచ్చి మహిమ చేసెను ఆ మాయదారి కృష్ణుడొచ్చి మహిమ చేసెను ఉట్టి మీద పాలు పెరుగు ఎట్లు దించెనే ?   ఉట్టి మీద పాలు పెరుగు ఎట్లు దించెనే ? కొట్టబోతే దొరకడమ్మ చిన్ని కృష్ణుడు!!ఏల!! కాళింది మడుగులోన దూకినాడమ్మా బాలుడు కాదమ్మ పెద్దవాడమ్మా!!ఏల!! చీరలన్ని మూట కట్టి చిన్ని కృష్ణుడు   చీరలన్ని మూట కట్టి చిన్ని కృష్ణుడు ఆ పొన్న మాను పైన పెట్టి పంతమాడెనే!!ఏల!!  

దుక్కు దుక్కు దున్నారంట

గొబ్బియళ్ళొ గొబ్బియళ్ళొ గొబ్బియళ్ళొ గొబ్బియళ్ళొ దుక్కు దుక్కు దున్నారంట - ఏమి దుక్కు దున్నారంట రాజా వారి తోటలో జామ దుక్కు దున్నారంట అలనాటి అక్కల్లారా చంద్రగిరి భామల్లారా భామలసిరి గొబ్బిళ్ళో గొబ్బియళ్ళొ గొబ్బియళ్ళొ విత్తు విత్తు వేశారంట - ఏమి విత్తు వేశారంట రాజా వారి తోటలోన జామ విత్తు వేశారంట అలనాటి అక్కల్లారా చంద్రగిరి భామల్లారా గొబ్బిళ్ళో గొబ్బియళ్ళొ గొబ్బియళ్ళొ మొక్క మొక్క మొలిచిందంట - ఏమి మొక్క మొలిచిందంట రాజా వారి తోటలోన జామ మొక్క మొలిచిందంట అలనాటి అక్కల్లారా చంద్రగిరి భామల్లారా గొబ్బిళ్ళో గొబ్బియళ్ళొ గొబ్బియళ్ళొ పువ్వు పువ్వు పూసిందంట - ఏమి పువ్వు పూసిందంట రాజా వారి తోటలోన జామ పువ్వు పూసిందంట   అలనాటి అక్కల్లారా చంద్రగిరి భామల్లారా గొబ్బిళ్ళో గొబ్బియళ్ళొ గొబ్బియళ్ళొ  పిందె పిందె వేసిందంట - ఏమి పిందె వేసిందంట రాజా వారి తోటలోన జామ పిందె వేసిందంట అలనాటి అక్కల్లారా చంద్రగిరి భామల్లారా  గొబ్బిళ్ళో గొబ్బియళ్ళొ గొబ్బియళ్ళొ కాయ కాయ కాసిందంట - ఏమి కాయ కాసిందంట రాజా వారి తోటలోన జామ కాయ కాసిందంట   అలనాటి అక్కల్లారా చంద్రగిరి భామల్లారా గొబ్బిళ్