Posts

Showing posts from November, 2013

తులసీ బిల్వ మల్లికాది

ప. తులసీ బిల్వ మల్లికాది జలజ సుమముల పూజల కైకొనవే అ. జలజాసన సనకాది కరార్చిత జలదాభ సు-నాభ విభా-కర హృజ్జలేశ హరిణాంక సు-గంధ (తులసీ) చ. ఉరమున ముఖమున శిరమున భుజమున కరమున నేత్రమున చరణ యుగంబున కరుణతో నెనరుతో పరమానందముతో నిరతమును శ్రీ త్యాగరాజు నిరుపాధికుడై అర్చించు (తులసీ)