Posts

Showing posts from October, 2013

కోటి నదులు ధనుష్కోటిలోనుండగ

                        ప . కోటి నదులు ధనుష్కోటిలోనుండగ ఏటికి తిరిగెదవే ఓ మనసా అ . సూటిగ శ్యామ సుందర మూర్తిని మాటి మాటికి జూచే మహారాజులకు ( కో ) చ . గంగ నూపురంబునను జనించెను రంగని కావేరి కని రాజిల్లెను పొంగుచు శ్రీ రఘు నాథుని ప్రేమతో పొగడే త్యాగరాజు మనవి వినవే ( కో )

హెచ్చరిక గా రా రా హే రామచంద్రా

                     ప . హెచ్చరికగా రారా హే రామ చంద్ర హెచ్చరికగా రారా హే సుగుణ సాంద్ర అ . పచ్చ విల్తునికన్న పాలిత సురేంద్ర ( హెచ్చరిక ) చ 1. కనక మయమౌ మకుట కాంతి మెరయగను ఘనమైన కుండల యుగంబు కదలగను ఘనమైన నూపుర యుగంబు ఘల్లనను సనకాదులెల్ల కని సంతసిల్లగను ( హెచ్చరిక ) చ 2. ఆణి ముత్యాల సరులల్లలాడగను వాణి పతీంద్రులిరు వరుస పొగడగను మాణిక్య సోపానమందు మెల్లగను వీణ పల్కుల వినుచు వేడ్క చెల్లగను ( హెచ్చరిక ) చ 3. నిను జూడ వచ్చు భగిని కరంబు చిలుక మనసు రంజిల్ల నీ మహిమలను పలుక మిను వాసులెల్ల విరులను చాల జిలుక ఘన త్యాగరాజు కనుగొన ముద్దు గులుక ( హెచ్చరిక )

నాద తనుమనిశం శంకరం

                                                                                                                                                                                                     ప . నాద తనుమనిశం శంకరం నమామి మే మనసా శిరసా అ . మోదకర నిగమోత్తమ సామ వేద సారం వారం వారం ( నా ) చ . సద్యోజాతాది పంచ వక్త్రజ స - రి - గ - మ - ప - ధ - ని వర సప్త - స్వర విద్యా లోలం విదళిత కాలం విమల హృదయ త్యాగరాజ పాలం ( నా )

రామా కోదండ రామ

               రామా కోదండ రామ ! రామా కల్యాణ రామ రామా పట్టాభి రామ ! రామా రామయ్య ( పావన ) రామ రామ సీతాపతి రామ ! నీవేగతి రామా నీకు మ్రొక్కితి ! రామా నీచేజిక్కితి రామా నీకెవరు జోడు ! రామా క్రీగంట జూడు రామా నేను నీవాడు ! రామా నాతో మాటాడు రామా నామమే మేలు ! రామా చింతనే చాలు రామా నీవు నన్నేలు ! రామా రాయడే చాలు రామా నీకొక్క మాట ! రామా నాకొక్క మూట రామా నీపాటే పాట ! రామా నీబాటే బాట రామా విరాజ రాజ ! రామా ముఖజిత రాజ రామా భక్త సమాజ ! రక్షిత త్యాగరాజ