Posts

Showing posts from August, 2013

చూడరే చెలులార

చూడరే చెలులారా - పంతువరాళి రాగం                         ప. చూడరే చెలులార యమునా దేవి సొగసెల్ల సంతోషమున 1. ఎర్రని పంకే-రుహములే అందు ఇంపైన భ్రుంగనాదములే!!చూడరే!! 2. ఇసుక దిన్నెలెంత తెలుపే మేను ఇంద్ర నీలము వంటి నలుపే!!చూడరే!! 3. మేటికలు వజ్రంపు శిలలే అందు కుటిలమైన చిన్నయలలే!!చూడరే!! 4. హంసల రవళిచే చాల దేవి అదిగో చెలంగెనీ వేళ!!చూడరే!! 5. పొలతులార పొదరిండ్లే తేనెలొలుకు ఖర్జూరపు పండ్లే!!చూడరే!! 6. ఫలముచే ద్రాక్ష లతలే అందు పచ్చని చిలుకల జతలే!!చూడరే!! 7. వింత వింత విరుల వాన మదికెంతెంతో మరులయ్యెనే!!చూడరే!! 8. కోకిలములు మ్రోసెనే మరుడు కుసుమ శరంబులేసెనే!!చూడరే!! 9. చల్లని మలయా మారుతమే కృష్ణ స్వామిని కూడునది సతమే!!చూడరే!! 10. రాజ వదనలార కనరే త్యాగరాజ సఖుని పాట వినరే!!చూడరే!! ఏమని నెర నమ్ముకొందుము - సౌరాష్ట్రం రాగం 1. ఏమని నెర నమ్ముకొందుము కృష్ణా  ఎందుకింత వాదు  1. జలకమాడు వేళ వలువలు దాచి  మమ్మలయింపగ లేదా కృష్ణా!!ఏమని!! 2. ముదితల రమ్మని తిలకములిడి పంట  మోవి నొక్కలేదా కృష్ణా!!ఏమని!! 3. మును నీవు వెన్న నారగించి తరుణుల  మోమున పూసిపో-లేదా కృ

శృంగారించుకొని వెడలిరి

                                 ప. శృంగారించుకొని వెడలిరి శ్రీకృష్ణుని తోనూ అ. అంగ రంగ వైభోగముతో గోపాంగనా మణులెంతో సొగసుగ!!శృ౦గారి౦చుకొని!! 1. నవ్వుచు కులుకుచు నొకతె కొప్పున పువ్వుల ముడుచుచు నొకతె దువ్వుచు కురులను నొకతె కృష్ణుని రవ్వ జేయుచు నొకతె వేడ్కగ!!శృ౦గారి౦చుకొని!! 2. మగడు వీడనుచు నొకతె రవికయు బిగువున జేర్చుచు నొకతె తగును తనకనుచునొకతె పాద యుగముల నొత్తుచునొకతె వేడ్కగ!!శృ౦గారి౦చుకొని!! 3. సొక్కుచు సోలుచు నొకతె కృష్ణుని గ్రక్కున ముద్దిడునొకతె పక్కగు రమ్మనుచు నొకతె మడుపుల- నక్కర నొసగుచు నొకతె వేడ్కగ!!శృ౦గారి౦చుకొని!! 4. పరిమళములందుచు నొకతె శ్రీ హరి హరియనుచును నొకతె ఉరమున జేర్చుచు నొకతె పయ్యెద జరిపి వేడుకొనుచు నొకతె వేడ్కగ!!శృ౦గారి౦చుకొని!! 5. సారసాక్షయనుచు నొకతె కను సైగను పిలుచుచు నొకతె రారాయనుచును నొకతె త్యాగ- రాజ సఖుడనుచు నొకతె వేడ్కగ!!శృ౦గారి౦చుకొని!! ఏనోము నోచితిమో - పున్నాగ వరాళి ప. ఏ నోము నోచితిమో చెలులమే దానమొసగితిమో అ. శ్రీనాధు కొలువమరె చెలులు చెక్కిళ్ళునొత్తుచును మానక మోవానుచు చంద్రానను హృదయముననుంచ!!ఏనోము!! 1. స్త్రీ రత్నములు మనము చెల

నంద గోపాల ముకుంద

                    ప. నంద గోపాల ముకుంద గోకుల నందన యమునా తీర విహార అ.ప.మందర గిరిధర మామవమాధవ మురళీధర మధుసూదన హరే చ. మందహాస వదన మంజుల చరణ అరవింద లోచన ఆశ్రిత రక్షణ పీతాంబర ధర పన్నగ శయన కలి కల్మష హరణ కరుణా పూరణ వందిత మునిబృంద గురు గుహానంద వైకుంఠ స్థితానంద కంద గోవర్ధనోద్ధార గోపస్త్రీ జార గోవింద

తులసీ దళములచే

                                       ప.   తులసీ దళములచే సంతోషముగా పూజింతూ  అ.  పలుమారు చిరకాలము పరమాత్ముని పాదములను!!తులసీ!! చ.  సారసీరుహ పున్నాగ చంపక పాటల కొలువగ కరవీర మల్లికా సుగంధ రాజసుమముల్ ధరనివి యొక పర్యాయము ధర్మాత్ముని సాకేత పురవాసుని శ్రీరాముని వరత్యాగరాజసుతుని!!తులసీ!!         

సాగర శయన విభో

Image

కంజ దళాయతాక్షి

                          ప , కంజ దళాయతాక్షి కామాక్షి కమలా మనోహరి త్రిపుర సుందరి మధ్యమ కాల సాహిత్యం : కుంజర గమనే మణి మణ్డిత మంజుల చరణే మామవ శివ పంజర శుకి పంకజ ముఖి గురు గుహ రంజని దురిత భంజని నిరంజని చ . రాకా శశి వదనే సురదనే రక్షిత మదనే రత్న సదనే శ్రీ కాంచన వసనే సురసనే శృంగారాశ్రయ మంద హసనే మధ్యమ కాల సాహిత్యం ఏకానేకాక్షరి భువనేశ్వరి ఏకానందామృత ఝరి భాస్వరి ఏకాగ్ర మనోలయకరి శ్రీకరి ఏకామ్రేశ గృహేశ్వరి శంకరి

అఖిలాండేశ్వరి రక్షమాం

Image
                                అఖిలాండేశ్వరి రక్ష మాం ఆగమ సంప్రదాయ నిపుణే శ్రీ అనుపల్లవి నిఖిల లోక నిత్యాత్మికే విమలే నిర్మలే శ్యామళే సకల కలే చరణమ్ లంబోదర గురు గుహ పూజితే లంబాలకోద్భాసితే హసితే వాగ్దేవతారాధితే వరదే వర శైల రాజ నుతే శారదే ( మధ్యమ కాల సాహిత్యమ్) జంభారి సంభావితే జనార్దన నుతే జుజావంతి రాగ నుతే ఝల్లీ మద్దళ ఝర్ఝర వాద్య నాద ముదితే జ్ఞాన ప్రదే

మామవ పట్టాభిరామ

Image
      ప. మామవ పట్టాభి రామ జయ మారుతి సన్నుత నామ అ. కోమల తవ పల్లవ పద కోదండరామ ఘనశ్యామల విగ్రహాబ్జనయన సంపూర్ణకామ రఘురామ కళ్యాణరామ రామ చ. చత్రచామర ధృత భరత లక్ష్మణ శతృఘ్న విభీషణ సుగ్రీవ ప్రముఖాది సేవిత అత్రి వశిష్టాద్యనుగ్రహ పాత్ర దశరథ పుత్ర మణిరంగవల్యాలంకృత నవరత్న మంటపే విచిత్ర మణిమయ సింహాసనే సీతయాసహ సంస్థిత సుచరిత్ర పరమ పవిత్ర గురుగుహమిత్ర పంకజమిత్ర వంశసుధాంభుధిచంద్ర మేధినీఫాల రామచంద్ర

గంధము పూయరుగా

Image
ప. గంధము పుయ్యరుగా పన్నీరు గంధము పుయ్యరుగా అ. అందమైన యదు నందనుపై కుంద రదనలిరవొందగ పరిమళ (గ) చ1. తిలకము దిద్దెరుగా కస్తూరి తిలకము దిద్దెరుగా కలకలమని ముఖ కళ కని సొక్కుచు పలుకులనమృతములొలికెడు స్వామికి (గ) చ2. చేలము కట్టెరుగా బంగరు చేలము కట్టెరుగా మాలిమితో గోపాల బాలులతో- నాల మేపిన విశాల నయనునికి (గ) చ3. హారతులెత్తెరుగా ముత్యాల హారతులెత్తెరుగా నారీ మణులకు వారము యౌవన వారకమొసగెడు వారిజాక్షునికి (గ) చ4. పూజలు సేయరుగా మనసార పూజలు సేయరుగా జాజులు మరి విరివాజులు దవనము రాజిత త్యాగరాజ నుతునికి (గ)

నగుమోము గలవాని

              ప . నగు మోము గల వాని నా మనో - హరుని జగమేలు శూరుని జానకీ వరుని చ 1. దేవాది దేవుని దివ్య సుందరుని శ్రీ వాసు - దేవుని సీతా రాఘవుని ( న ) చ 2. సుజ్ఞాన నిధిని సోమ సూర్య లోచనుని అజ్ఞాన తమమును అణచు భాస్కరుని ( న ) చ 3. నిర్మలాకారుని నిఖిలాఘ హరుని ధర్మాది మోక్షంబు దయ చేయు ఘనుని ( న ) చ 4. బోధతో పలుమారు పూజించి నే - నారాధింతు శ్రీ త్యాగరాజ సన్నుతుని ( న )