Posts

Showing posts from October, 2012

బ్రోచెవారెవరురా

Image
బ్రోచేవారెవరురా త్యాగరాజ కృతి ఖమాస్ రాగం బ్రోచే వారెవరురా నిను వినా రఘు వరా నీ చరణామ్బుజ మును నేవిడజాల కరుణాల వాల || ఓ చతురాననాది వందిత నీకు పరాకేల నయ్య నీ చరితము పొగడ లేను నా చింత తీర్చి వరములిచ్చి వేగమె|| సీతాపతే నా పై నీ కభిమానము లేదా వాతాత్మజా ర్చిత పాద నా మొరలను విన రాదా ఆతురముగ కరి రాజుని బ్రోచిన వాసు దేవుడె నీవు కదా నా పాతక మెల్ల పోగొట్టి గట్టిగ నా చేయి బట్టి విడువక |

నను పాలింపగ

Image
ప. నను పాలింప నడచి వచ్చితివో నా ప్రాణ నాథ అ. వనజ నయన మోమును జూచుట జీవనమని నెనరున మనసు మర్మము తెలిసి (నను) చ. సుర పతి నీల మణి నిభ తనువుతో ఉరమున ముత్యపు సరుల చయముతో కరమున శర కోదండ కాంతితో ధరణి తనయతో త్యాగరాజార్చిత (నను)

ఎందఱో మహానుభావులు

                                                                                  ప . ఎందరో మహానుభావులందరికి వందనము అ . చంద్ర వదనునియంద చందమును హృదయారవిందమున జూచి బ్రహ్మానందమనుభవించు వా ( రెందరో ) చ 1. సామ గాన లోల మనసిజ లావణ్య ధన్య మూర్ధన్యు ( లెందరో ) చ 2. మానస వన చర వర సంచారము సలిపి మూర్తి బాగుగ పొడగనే వా ( రెందరో ) చ 3. సరగున పాదములకు స్వాంతమను సరోజమును సమర్పణము సేయు వా ( రెందరో ) చ 4. పతిత పావనుడనే పరాత్పరుని గురించి పరమార్థమగు నిజ మార్గముతోను పాడుచును సల్లాపముతో స్వర లయాది రాగములు తెలియు వా ( రెందరో ) చ 5. హరి గుణ మణి - మయ సరములు గళమున శోభిల్లు భక్త కోటులిలలో తెలివితో చెలిమితో కరుణ కల్గి జగమెల్లను సుధా దృష్టిచే బ్రోచు వా ( రెందరో ) చ 6. హొయలు మీర నడలు కల్గు సరసుని సదా కనుల జూచుచును పులక శరీరులై ఆనంద పయోధి నిమగ్నులై ముదంబునను యశము కల వా ( రెందరో ) చ 7. పరమ భాగవత మౌని వర శశి విభా - కర సనక సనందన దిగీశ సుర కింపు