Posts

ఎవ్వరెవ్వరివాడో యీ జీవుడు చూడనెవ్వరికి నేమౌనో ఈ జీవుడు!

Image
ఎవ్వరెవ్వరివాడో యీ జీవుడు చూడనెవ్వరికి నేమౌనో ఈ జీవుడు! ఎందరికి కొడుకుగాడీ జీవుడు వెనుక కెందరికి తోబుట్టుడీ జీవుడు యెందరిని భ్రమయించడీ జీవుడు దుఃఖమెందరికి గావింపడీ జీవుడు ఎక్కడెక్కడ దిరుగడీ జీవుడు వెనుక కెక్కడో తన జన్మమీ జీవుడు యెక్కడి చుట్టము తనకు నీ జీవుడు వెనుక కెన్ని తనువులు మోవడీ జీవుడు యెన్నగల తిరువేంకటేశు మాయల దగిలి యెన్ని పదవుల బొందడీ జీవుడు!!

దేవీం ప్రణమామ్యహమ్ (ఋషిపీఠం విశిష్టసంచిక) 2004

Image
హిందూ సంప్రదాయములో శ్రీదేవీ నవరాత్రులకు విశిష్ట ప్రాధాన్యం ఉన్నది . మన భారతదేశంలో ఈ దేవీ పూజలు వేదకాలం నుంచే ఉన్నాయనడానికి ఋగ్వేదంలోని దేవీసూక్త , రాత్రిసూక్తాదులే నిదర్శనం . బ్రాహ్మణములు , అరణ్యకములు , ఉపనిషత్తులలో కూడా దేవీ ప్రస్తావన విరివిగా ఉన్నది . మహాభారతంలో దుర్గాదేవి స్తుతి ఉన్నది . స్కాంద , మత్స్య , వామన , వరాహాది పురాణాలలో దేవీవృత్తాంతం కనిపిస్తున్నది . దేవీ భాగవతం శ్రీదేవీ ప్రాశస్త్యాన్ని వేనోళ్ళ కొనియాడుతున్నది . దేవీ నవరాత్రులు రెండు రకాలుగా జరుగుతాయి . చైతశుద్ధ విదియ మొదలు నవమి వరకూ చేసే నవరాత్రులను వసంత నవరాత్రులని , ఆశ్వయుజ శుద్ధ విదియ మొదలు నవమి వరకూ చేసే నవరాత్రులను శరన్నవరాత్రులని పిలుస్తారు . ఈ రెండింటిలోను శరన్నవరాత్రులకే దేవీనవరాత్రులని ప్రసిద్ధి . ఈ శరన్నవరాత్రులలో దేవీపూజలను తొమ్మిది రోజులు చెయ్యడానికి కారణం భవిష్యపురాణం , దేవీపురాణము , మార్కండేయ పురాణములలో చెప్పబడింది . దుష్టశిక్షణ , శిష్టరక్షణ చేయడానికి ఆదిశక్తి అయిన జగన్మాత తొమ్మిది అవతారాలను ధరించింది . అవి మహాకాళి , మహిషాసురమర్దిని , చాముండ , నంద , రక్తదంతి , శాకంభరి , దుర్గ , మాతంగిని , భ్రామరి అన